నల్లులతో సహజీవనం చేస్తూ
జనం యాతనలు పడుతున్నరొజులు
అప్పట్లో అశేష ప్రచారంగల పత్రికలో
విశేషంగా ఓ ప్రకటన వెలువడింది.
నల్లులను చంపే యంత్రం 5 రూపాయలకే
కేశవరావు దాన్ని అతిజరూరుగా తెప్పించాడు
అందమైన పెట్టెలో భద్రపరిచి వుంది తెరిచాడు,
ఆశ్చర్యం రెండు పలుగురాళ్ళు ఏ బీ అని రాసివున్నయ్.
చిన్నకాగితంలో చుట్టబడివున్నాయ్.కాగితం విప్పిచూసాడు.
నల్లిని పట్టుకుని ఏ అనే రాయిమీద పెట్టి బీ అనేరాయితో గట్టిగా
కొట్టండి నల్లి హతం,మీబాధ ఖతం--
అప్పట్లోఇదే ఐదురూపాయలకు రేడియో వొస్తుందంటే రంగు రంగుల
బొమ్మ ముద్రించిన కాగితం వచ్చేది--
జై అమృతసర్ జైజై జలంధర్--అక్కడినుంచే ఇవన్నీ ఉత్పత్తి అయే వంచనల కర్మాగారాలు.
శివుడద్రిన శయనించుట
రవిచంద్రులు మింటనుంట రా
జీవాక్షుండవిరళముగ శేషునిపై
పవళించుట నల్లిబాధ పడలేకసుమీ!! ఇతిశివం
===================================